బాధితులకు వైద్య సహాయం అందేలా చూడాలి

నిర్మల్‌ : గాయప డి పోలీస్‌ స్టేషన్లకు వచ్చే బాధితులకు వెంటనే వైద్య సహాయం అందేలా చూడాలని నిర్మల్‌ జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. గురువారం జిల్లా పో లీసు కార్యాలయంలో మెడికల్‌ సర్టిఫికెట్‌, ఎఫ్‌ఎ్‌సఎల్‌ వర్టికల్‌ అధికారులకు ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఏ వి ధంగా అయినా గాయపడి స్టేషన్‌కు వచ్చిన వారిని సాధ్యమైనంత వరకు వెంటనే ప్రథమ చికిత్స అందించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలఇ ఆదేశించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులతో మా ట్లాడి మెరుగైన వైద్యం అందేలా కృషి చేయాలని చెప్పారు. తర్వాత బాధితుడికి సంబంధించిన మెడికల్‌ సర్టిఫికెట్‌ను ఆసుపత్రి నుంచి తీసుకొని ఎఫ్‌ఎ స్‌ఎల్‌ నివేదికలు సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో న మోదు చేయాలని సూచించారు.

 

ఈ అప్లికేషన్‌ను తానే స్వయంగా పరిశీలిస్తున్నానని ఇందుకు ఏ మాత్రమూ జాప్యం చేయవద్దని ఈ సందర్భంగా సూచించారు. అందులో నమోదు చేయని వాటిని వెంటనే నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో వర్టికల్‌ అధికారి వేణుగోపాల్‌ రావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఐటీ కోర్‌ టీం ఇన్‌చార్జి మురాద్‌ అలీ, జి ల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల మెడికల్‌ సర్టిఫికెట్‌ ఎంఎ్‌సఎల్‌ వర్టికల్‌ అధికారులు పాల్గొన్నారు.