మూడు జిల్లాలకు కొత్త వైద్యాధికారులు


హైదరాబాద్‌: పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మూడు జిల్లాలకు నూతన వైద్యాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్‌ జిల్లా వైద్యాధికారిగా పనిచేస్తున్న ఆర్‌.రామ్మోహన్‌రావును నల్గొండ జిల్లా ఆసుపత్రికి, వరంగల్‌ పట్టణ జిల్లా వైద్యాధికారి బి.హరీశ్‌రాజ్‌ను ఎంజీఎం ఆసుపత్రికి, ఖమ్మం జిల్లా వైద్యాధికారి బి.కళావతిని సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓలుగా బదిలీ చేసింది. వీరి స్థానాల్లో కరీంనగర్‌కు గుజ్జాల సుజాత, వరంగల్‌ పట్టణ జిల్లాకు కె.లలితాదేవి, ఖమ్మంకు బి.మాలతిని జిల్లా వైద్యాధికారులుగా నియమించింది. తక్షణమే నూతన వైద్యాధికారులు బాధ్యతలు స్వీకరించాలని ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు ఆదేశించారు.