జనవరిలో పల్స్‌ పోలియో : జేడీ

నెల్లూరు : వచ్చే నెలలో నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ జేడీ రాజేంద్ర ప్రసాద్‌ సూచించారు. నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం పల్స్‌ పోలియోపై ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూక్ష్మ ప్రణాళిక ప్రకారం చిన్నారులకు సక్రమంగా పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. శాఖాపరమైన విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, డీటీసీవో వెంకట ప్రసాద్‌, డీఐవో శెలీనాకుమారి, పీవోడీటీ ఉమామహేశ్వరి, డాక్టర్‌ రమాదేవి, డెమో మీనాకుమారి, హెచ్‌ఈ సునీత తదితరులు పాల్గొన్నారు.