సమగ్ర రక్షణ.. బాలికలకు శిక్షణ

మంచిర్యాల : తల్లి కడుపులో ఉన్నప్పటీ నుంచే ఆడపిల్లల విషయంలో వివక్ష కొనసాగుతోంది. కౌమర దశ వచ్చాక ఆత్మన్యూనతభావం, శరీర నిర్మాణంలో వచ్చే మార్పులు, లైంగిక వేధింపులు ఇలాంటి సమస్యలతో అమ్మాయిలు భయానికి లోనవుతుంటారు. వీరి సందేహాలను తీర్చే వారు లేకపోవడంతో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ పేరుతో బాలికల్లో చైతన్యం నింపడానికి కార్యక్రమాలు చేపడుతోంది. మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోళ్లికేరి చొరవతో ఈ నెల 20న మంచిర్యాల జిల్లాలోని కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఆరు రోజుల శిక్షణ పూర్తయింది. 


బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ శిక్షణ కొనసాగుతోంది. దిశ, సమత సంఘటనల నేపథ్యంలో పాలనాధికారి జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఈ శిక్షణను ప్రారంభించారు. రెండు విడతల్లో కొనసాగిస్తున్నారు. జిల్లాలో మొదటి విడతలో నాలుగు, రెండో విడతలో పది పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అమ్మాయిల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా ఇది కొనసాగుతోంది.


శిక్షణ ఇస్తున్న శిక్షకురాలు


జిల్లాలో మొదటి విడతలో నాలుగు పాఠశాలల్లో పరిచయ్‌ పేరుతో శిక్షణ కొనసాగిస్తున్నారు. రెండో విడతలో దిశ పేరుతో పది పాఠశాలల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పరిచయ్‌, దిశ, సఖి పేర్లతో వీటిని నిర్వహిస్తారు. ప్రతి పాఠశాలలో ఇద్దరు సమన్వయకర్తలు, ఐదుగురు శిక్షకులు బాలికల్లో చైతన్యం నింపుతున్నారు. ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతున్నారు. బాలికల పరిస్థితిని అంచనా వేసి తదనుగుణంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.


నేర్పిస్తున్న విషయాలు●


అంతరశక్తి, బాహ్యశక్తి


అమ్మాయిల్లో ఉండే శక్తి


నా అద్భుతమైన శరీరం


పీరియడ్స్‌ సమాచారం


అంతర, బాహ్య అందం


ఇతరులతో


రక్షిత, శక్తికలిగిన భావాలు


హక్కులు