శిరోజాల సంరక్షణకోసం..

కోడిగుడ్డు తెల్లసొనలో రెండు టీ స్పూన్‌ల బోరిక్‌ పౌడర్‌ కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలను శుభ్రపరుచుకోవాలి.
- వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లకు మంచి పోషణ లభించి, శిరోజాలు నిగనిగలాడుతాయి.
- కొన్ని 'టీ' ఆకులు వేసి నీళ్లను మరిగించాలి. చల్లారిన తర్వాత తలకు పట్టించాలి.
- ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
- తగినన్ని తులసి ఆకులను శుభ్రపరిచి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ని జుట్టు కుదుళ్లకు పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే చర్మసమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
- దీనివల్ల తలలో పేలు కూడా అరికట్టవచ్చు.
- నాలుగు 'టీ' స్పూన్ల నిమ్మరసంలో రెండు 'టీ' స్పూన్‌ల కొబ్బరి పాలు కలుపాలి.
- ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకంతటికీ పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి.
- పదిహేను రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.