ఈఎస్‌ఐ’లో మందులు కరువు

గుమ్మడిదల: గుమ్మడిదలలోని ఈఎ్‌సఐ ఆసుపత్రి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ప్రతినెలా వేతనాల్లో కట్‌ చేసుకుంటున్నా కార్మికులకు మందులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అధిక డబ్బును వెచ్చించి నష్టపోతున్నామని పలువురు కార్మికులు వాపోతున్నారు. గుమ్మడిదల పరిధిలోని పలు గ్రామాలలో పరిశ్రమలు ఏర్పడడంతో వేల సంఖ్యలో కార్మికులు వాటిలో పని చేస్తున్నారు. వీరి సౌకార్థం బొంతపల్లి కేంద్రంగా వైద్యసేవలు అందించాలని వైద్యఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బొంతపల్లిలో భవనం లేక ప్రస్తుతం గుమ్మడిదలలో ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.