అమనగల్లు : ధ్యానంతో సహనం, సంకల్ప శక్తి సిద్ధిస్తుందని అది వ్యక్తి పురోగమనానికి బాటలు వేస్తుందని పిరమిడ్ స్పిర్చ్యువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రపంచ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అన్నారు. దృష్టిని బట్టే సృష్టి, నడవడికను బట్టే ఫలితం ఉంటుందన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ లో ధ్యాన మహోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మహిళా ధ్యాన మహాచక్రం-2019లో భాగంగా ఆరో రోజు గురువారం పత్రీజీ వేణునాఽథ ధ్యానంతో ఽధ్యాన సభలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు పత్రీజీ వేణునాథ ధ్యానంలో ధ్యానులు లీనులయ్యారు. ఈ సందర్భంగా పత్రీజీ మాట్లాడుతూ.. ధ్యానంతో ఆత్మ స్థితిని పొందవచ్చన్నారు. సంగీతానికి శృతి ఎలాంటిదో ఆత్మకు ధ్యానం అలాంటిందని వివరించారు. శ్వాస మీద ధ్యాసతోనే వ్యక్తికి పరిపూర్ణ స్థితి లభిస్తుందని అందుకు ధ్యాన శక్తులు దోహద పడుతాయన్నారు.
మహేశ్వర మహాపిరమిడ్‌ను ఆమెరికాకు చెందిన ధ్యాన, పిరమిడ్ మాస్టర్ ఆండ్రు కోహెన్ సందర్శించారు. భారత ధ్యాన, ఆద్యాత్మిక కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. మహే శ్వరం మహాపిరమిడ్‌లో 2020 డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ ట్రస్టీ చైర్మన్ కోర్పోలు విజయ భాస్కర్ రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్టీ సభ్యులు , నిర్వాహకులు ప్రేమయ్య, నీరజా రెడ్డి, లక్ష్మి, మాధవి, విజయభాస్కర్ రెడ్డి, నంద ప్రసాద్, జ్యోతిరెడ్డి, రవిశాస్త్రీ, సురే శ్‌బాబు, రాంబాబు, శివప్రసాద్,సాంబశివరావు, లక్ష్మణ్ రావు, పాల్గొన్నారు.
ధ్యానంతో ఆనందమయ జీవనం
వ్యక్తి సన్మార్గ పురోగమనానికి ధ్యానం గొప్ప మార్గమని మహాబూబ్ నగర్ జడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి అన్నారు. మహేశ్వర మహాపిరమిడ్‌ను గురువారం స్వర్ణసుధాకర్ రెడ్డి సందర్శించారు.