హైదరాబాద్: జరగనున్న 10 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియమితులైన పరిశీలకులు 5, 6 తేదీల్లో కార్పొరేషన్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు ఎన్నికల పరిశీలకులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని నియమించారు. రామగుండం- ఎం.అంజన్‌కుమార్ యాదవ్, బడంగ్‌పేట్- వి.హనుమంతరావు, మీర్‌పేట్- ఎం.కోదండరెడ్డి, బండ్లగూడ జాగీర్- రాములు నాయక్, బోడుప్పల్- గీతారెడ్డి, ఫిర్జాదిగూడ- ఎం.శశిధర్‌రెడ్డి, జవహర్‌నగర్- ఎం.ఎ.ఖాన్, నిజాంపేట్- పొన్నాల లక్ష్మయ్య, నిజామాబాద్- దామోదర రాజనర్సింహను నియమించారు. అదే విధంగా ఎన్నికలు జరిగే 95 మున్సిపాలిటీలకూ పీసీసీ పరిశీలకులను కాంగ్రెస్ నియమించింది.