కడప(ఆరోగ్యజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఉన్నతాధికారులైన వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదరావు, సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్‌ను వైద్యులు, అధికారులు, ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, భద్రతా సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్‌చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. వైద్యులు, ఉద్యోగులు నూతన ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తూ మనల్నే నమ్ముకుని ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్ వెంకటశివ, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ చంద్రబాబు, డాక్టర్ రేఖారావు, డాక్టర్ రామమనోహర్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.