విద్యానగర్: జగిత్యాల పట్టణంలో జిల్లా వెవా (విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పడకంటి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా తొగిటి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా అక్కనపెల్లి వెంకటరమణ, గౌరవాధ్యక్షునిగా ఇనుగుర్తి రాజశేఖర్, ఉపాధ్యక్షునిగా ఎర్రోజు చంద్రమౌళి, ముమ్మాడి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శిగా సింహరాజు సూర్యనారాయణ, కార్యదర్శిగా మండలోజు శ్రీధర్, మహిళా కార్యదర్శిగా గాజోజు స్వర్ణలత, ముఖ్య సలహాదారుగా దుర్శెట్టి కిరణ్‌కుమార్, సలహాదారులుగా ముమ్మాడి ఉమారాణి, బెజ్జరపు గంగారాజం, మండలోజు ఉదయ్‌భాస్కర్ ఎన్నికయ్యారు.