హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్యవిద్యను పూర్తి చేసిన అభ్యర్థులకు ఇచ్చే పట్టాకు కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు తెలంగాణలోని వైద్యకళాశాలల్లో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరిటనే పట్టా ధ్రువపత్రాన్ని అందజేస్తున్నారు.2 నెలల కిందటే ఎంబీబీఎస్, బీడీఎస్ డిగ్రీ వైద్యవిద్య పట్టాలకు గుర్తింపునిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు పీజీ కోర్సులకూ లభించింది. ఇక నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో పట్టాలను కాళోజీ వర్సిటీ పేరిటే అందజేస్తామని కాళోజీ ఆరోగ్యవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి తెలిపారు.