నర్సింగ్‌ వృత్తికి మరింత గుర్తింపు తేవాలి

నెల్లిమర్ల, (ఆరోగ్యజ్యోతి): వైద్యరంగంలో నర్సింగ్‌ వృత్తికి మరింత గుర్తింపు తెచ్చేలా అందరూకృషి చేయాలని మిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సీఆర్‌. షమ్‌షీర్‌ బేగం కోరారు. ఫ్లోరెన్స్‌ నైౖటింగేల్‌ జయంతి సందర్భంగా బుధవారం మిమ్స్‌ ఆసుపత్రి నుంచి నెల్లిమర్ల వరకు నర్సింగు విద్యార్థినులతో కొవ్వొతుల ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు జయంతి సభలో ఆమె మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు నర్సింగ్‌ ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ లక్ష్మీకుమార్‌, సూపరింటెండెంట్‌ రాఘురాం, మిమ్స్‌ ఉద్యోగులు, నర్సింగ్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.