పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం

విజయనగరం : స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ పి.రవి అన్నారు. లెప్రా సొసైటీ వాటర్‌ ఎయిడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈలకు, ఏఈలకు మంగళవారం నెహ్రూ యువ కేంద్రం ప్రాంగణంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్షితమైన నీరు, పరిసరాల శుభ్రత విషయంలో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.