లక్ష్మీశ్రీనివాస్‌కు స్వర్ణకంకణ బహూకరణ


గుంటూరు సాంస్కృతికం: వీణ విద్వాంసురాలు రామరాజు లక్ష్మీశ్రీనివాస్‌కు ఆదివారం రాత్రి స్వర్ణకంకణ సన్మానం జరిగింది. బృందావనగార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సుప్రసిద్ధ రంగస్థల నటుడు అక్కిరాజు రామకృష్ణ  అధ్యక్షత వహించారు. సభలో జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గుదిబండి వెంకటరెడ్డి, ప్రసన్నానందగిరిస్వామి, ఆడిటర్‌ రామరాజు శ్రీనివాసరావు, డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్‌.మస్తానయ్య, కమర్షియల్‌ టాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ధనలక్ష్మి తదితరులు మాట్లాడారు. అనంతరం గుదిబండి వెంకటరెడ్డి, మస్తానయ్య తదితరులు లక్ష్మీశ్రీనివాస్‌కు స్వర్ణకంకణాన్ని తొడిగి సన్మానించారు. కార్యక్రమంలో రచయితలు సయ్యద్‌ జానీబాషా, బి.వి.రాఘవరెడ్డి, విశ్వశాంతి ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు బాలచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.