మల్లికార్జునపేట(గుంటూరు): వైఎస్సార్ విద్యోన్నతి పథకం ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కల్పన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం క్రాష్ కోర్సు, ప్రాక్టీస్ పరీక్షలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అర్హత కలిగిన గ్రూప్-1 శిక్షణ సంస్థల్లో ఈ శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. www.jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.30 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారు, ఆదాయ పరిమితి రూ.6 లక్షల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 79894 99978 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.