హైదరాబాద్; గుంటూరు- కాచిగూడ- గుంటూరు ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా ఉన్నతీకరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఫిబ్రవరి 1న రైలు నంబరు 17252 గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ గుంటూరులో సాయంత్రం 7గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.45కు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 17521 కాచిగూడలో మధ్యాహ్నం 3.10 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45గంటలకు గుంటూరు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.
వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వైకుంఠ ఏకాదశికి సికింద్రాబాద్- తిరుపతి మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 4న రైలు నంబరు 07429 సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 6న రైలు నంబరు 07430 తిరుపతిలో సాయంత్రం 6.50కి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి.