రాయవరం , (ఆరోగ్యజ్యోతి): చిన్నారులు అందరికీ టీకాలు వేయించాలని మల్లవోలు పీహెచ్‌సీ వైద్యుడు శివరామకృష్ణ తెలిపారు. బుధవారం ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చిన్నారులకు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల్లో వైద్య సిబ్బంది టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలసత్వం వహించకుండా నిర్దేశించిన సమయాల్లో పిల్లలకు టీకాలు వేయించాలన్నారు. గర్భిణులపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు కలిసి చిన్నారులకు టీకాలు వేశారు.