తుని: కిందపడి మరణించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో చోటుచేసుకుంది. బొకారో ఎక్స్‌ప్రెస్ ఎస్-7 బోగీలో ఆదివారం ఓ వ్యక్తి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో వారు భయపడి, అదే బోగీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కొత్తకొట్టానికి చెందిన రెడ్డి సూర్యవెంకట శివ (37)కు చెప్పారు. అతడిని వారించడానికి వెళ్లిన శివకు, సదరు వ్యక్తికి వాగ్వాదం.. తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ దశలోనే తుని స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో నడుస్తున్న రైలులో నుంచి అతడు హోంగార్డును తోసేశాడు. దాంతో శివ కిందపడి, తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శివకు 2018లో పెళ్లయింది. ఆయన భార్య ప్రస్తుతం గర్భిణి.