వరంగల్: రాష్ట్రం మొత్తం కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వం కోరుకుంటున్నారని, కేటీఆర్ సమర్థుడని, కేసీఆర్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం ఏకపక్షంగా ఉంటుందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత సర్పంచి, లోక్‌సభ ఎన్నికలు, జడ్పీ ఎన్నికల్లో వరుసగా తెరాస విజయం సాధించిందని గుర్తుచేశారు. స్వాతంత్య్రం సాధించామని నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఆమె తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రులు అయ్యారని, మరి రాష్ట్రం సాధించిన కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని ప్రశ్నించారు. అయితే నిర్ణయం కేసీఆర్ తీసుకోవాలని అన్నారు.