అబ్బాయిలు వినండి. ఆఫీస్ బాత్రూంలో మీకు అసౌకర్యంగా ఉన్నందుకు మేం విచారిస్తున్నాం. అందుకు సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు అంటూ ఓ కంపెనీ హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ సదరు సంస్థ ఉద్యోగులకు ఓ నోటీస్ జారీ చేసింది. దీంతో కంగుతిన్న ఉద్యోగులు ఇదెక్కడి చోద్యం అంటూ సంస్థ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూకేకి చెందిన స్టాండర్డ్ టాయిలెట్ అనే సంస్థ ప్రొడక్టవిటీ కోసం ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తోంది. మీరు బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారు. వర్క్ లో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అందుకే బాత్రూం తొట్టిని మరింత ఒంపుగా ఉండేలా సరిచేస్తున్నాం అంటూ నోటీసులు జారీ చేసింది.
ఉన్న టాయిలెట్ ను 13డిగ్రీలు ఒంపుగా ఉండేలా డిజైన్ చేయాలంటూ మెహబీర్ గిల్ అనే డిజైనర్ కు సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ తరహా టాయిలెట్ ను డిజైన్ చేసే పనిలోపడ్డాడు మెహబీర్ గిల్.
అయితే ఈ కొత్త టాయిలెట్ల డిజైన్ పై మెహబీర్ గిల్ స్పందించాడు. యూకేలో సంవత్సరానికి ఉద్యోగల కోసం 4బిలియన్ల డార్లను ఖర్చు చేస్తున్నారు. అలాంటిది ఉద్యోగస్తులు ప్రొడక్టీవ్ గా పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. అందుకు సంస్థల్లో ఉద్యోగులు ప్రొడక్టీవ్ గా పనిచేసేలా కొత్త టాయిలెట్లను డిజైన్ చేస్తున్నాం. ప్రొడక్టీవ్ తో పాటు ఉద్యోగస్తుల ఆరోగ్యం బాగుంటుందని గిల్ చెప్పకొచ్చాడు.