ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల : పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన చీర్ల వెంకటస్వామి(55) అనే వ్యక్తి బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజమౌళిగౌడ్‌ తెలిపారు. కొత్తగా నిర్మించిన ఇంటి కోసం చేసిన అప్పు తీర్చలేక మనస్తాపం చెందారు. ఈక్రమంలో ఇదివరకు రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం రాత్రి తన గదిలో తలుపునకు గడియ పెట్టి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడన్నారు. వెంకటస్వామి కుమారుడు గోవర్ధన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.