దోమలు బాబోయ్‌.. దోమలు

పురపాలికల్లో పెరుగుతున్న దోమలు


యాదగిరిగుట్ట (ఆరోగ్యజ్యోతి) :పురపాలికల్లో దోమలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఖాళీ స్థలాలు అపరిశుభ్రంగా మారడం, మురుగు కాల్వల్లో మురుగును సరిగా తొలగించకపోవడం, వీధుల వెంట చెత్త చెదారం పేరుకుపోవడంతో ఈ సమస్య తీవ్రంగా మారింది. ఇళ్ల మధ్యన ఉన్న అపరిశుభ్రతపై ప్రజలలో అవగాహన కల్పించకపోవడం, అధికారులు, సిబ్బంది పట్టనట్లు ఉండటమే ఇందుకు కారణమని విమర్శలు వినబడుతున్నాయి. దీంతో ఇటీవల కాలంగా మలేరియా, డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆసుపత్రుల వద్ద వ్యాధుల పీడితులు బారులు తీరుతున్నారు.గుట్టలో పురపాలిక పరిధిలో బీసీ కాలనీ, ప్రశాంత్‌నగర్‌, పాతగుట్ట, నల్లపోశమ్మవాడ, శివాలయం వీధి, గుండ్లపల్లి, ఇందిరాకాలనీ, గణేశ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల నియంత్రణకు 2019-20 మున్సిపాలిటీలో దాదాపు రూ.3 లక్షల వ్యయం ఖర్చు చేసినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్‌ యంత్రం ద్వారా పొగ చల్లిస్తున్నట్లు, మురికి కాల్వలు, చెత్త నిల్వ ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నా అమలు కావడం లేదనే వాదనలు వినబడుతున్నాయి. ఫాగింగ్‌ యంత్రంతో మాత్రమే ఆయా చోట్ల తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులిపేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో దోమల నివారణకు నెలకు ఓ కుటుంబం రూ.250 పైనే ఖర్చు చేయక తప్పనిఆలేరు పురపాలికలో సుమారు 22వేల వరకు జనాభా నివసిస్తున్నారు. సుమారు 40 కాలనీల వరకు ఉన్నాయి. సగానికి పైగా కాలనీలలో పారిశుద్ధ్యం సమస్య నెలకొంది. మురుగు కాలువలు శిథిలం కావడంతో పందులు సంచారం చేస్తున్నాయి. ఫలితంగా దోమల ఉద్ధృతి అధికమవుతోంది. ఆదర్శనగర్‌, వడ్డెరబస్తీ, జంగాల కాలనీ, గణేష్‌నగర్‌, సిల్క్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో దోమల ఉద్ధృతి అధికంగా ఉంది. పురపాలికలో నిధుల లేమి కారణంగా దోమల నివారణకు నిధులు వెచ్చించిన పాపానపోలేదు. గడచిన ఏడాది కాలంలో కేవలం