హైదరాబాద్‌ బయలుదేరిన రాష్ట్ర ఐటీడీఏ జట్లు

ఆదిలాబాద్‌.(ఆరోగ్యజ్యోతి):  పక్షం రోజులుగా ఉమ్మడి జిల్లాల్లో సాగిన ఆశ్రమ పాఠశాలల ఇంటర్‌ సొసైటీ లీగ్‌ క్రీడా శిక్షణ శిబిరాలు ముగియడంతో ఐటీడీఏకు చెందిన ఆశ్రమ పాఠశాలల క్రీడాకారులు గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి జెండా ఊపి బస్సును సాగనంపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈనెల 3 నుంచి జరిగే ఇంటర్‌ సొసైటీ లీగ్‌ పోటీల్లో తెలంగాణ ఐటీడీఏ జట్టుకు వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. కార్యక్రమంలో జీఎస్‌ఆర్‌ ట్రావెల్స్‌ యజమాని ప్రమోద్‌కుమార్‌ ఖత్రి, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు డా.ఎం.డి.ఖాజీం, హేమంత్‌, మధు, శ్రీనివాస్‌, రవీందర్‌, గోపాల్‌, మూన్‌సింగ్‌, సునీల్‌, హాకీ శిక్షకుడు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.