కంకటపాలెం(బాపట్ల), ఆరోగ్యజ్యోతి : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో విస్తృతంగా పాల్గొనాలని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు రావిపూడి నాగమల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. కంకటపాలెంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, పలువురు యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పంగులూరి సుధాకర్, వంకాయలపాటి హరిబాబు, ప్రసాద్, తానా సమన్వయకర్తలు నూతి వంశీకృష్ణ, దొంతినేని సురేష్ చౌదరి, ప్రత్తిపాటి సురేష్ పాల్గొన్నారు.