హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : తెలంగాణలో సోమవారం కేవలం కొత్తగా 2 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1003కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న 16 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జి చేశారు. సోమవారం కొత్తగా నమోదైన రెండు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 25.కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలుపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.