ఢిల్లీ లో రెండు రోజుల్లో ఒక్క మృతీ లేదు... 3000 దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 28 వేల మంది విలవిలలాడుతుండగా, ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 886 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య 3 వేలకు పైగా ఉంది. గత 24 గంటల్లో 190 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా బాధితుల సంఖ్య 3108 కి చేరుకుంది. అయితే గత రెండు రోజుల్లో ఒక్క రోగి కూడా కరోనాతో మరణించలేదు. అలాగే గత 24 గంటల్లో ఒక్క రోగి అయినా కోలుకున్నట్లు ఎటువంటి రిపోర్ట్ కూడా లేదు. కాగా ఢిల్లీలో హాట్‌స్పాట్-కంటైన్మెంట్ జోన్‌ల సంఖ్య 97 కి పెరిగింది. ఈ ప్రాంతాల్లోని ప్రజల రాకపోకలు నిషేధించారు. అన్ని దుకాణాలు మూసివేశారు.