గర్భిణుల కోసం ప్రత్యేకంగా మొబైల్ డిస్పెన్సరీ

నాగపూర్ (మహారాష్ట్ర): కరోనా కంటైన్మెంటు జోన్లలోని గర్భిణులను పరీక్షించేందుకు ప్రత్యేకంగా మొబైల్ డిస్పెన్సరీలను నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది. లాక్‌డౌన్ సందర్భంగా గర్భిణులకు వైద్యపరీక్షలు చేయడం, ప్రసవం సమస్యగా మారిన నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా గర్భిణుల కోసం ప్రత్యేకంగా మొబైల్ డిస్పెన్సరీని ప్రారంభించారు. నాగపూర్ నగరంలోని ఆరోగ్య కార్యకర్తలు గర్భిణులను గుర్తించారని, వారికి పిరియాడికల్ వైద్య పరీక్షలు చేయడంతోపాటు సుఖ ప్రసవం అయ్యేలా మొబైల్ డిస్పెన్సరీ వైద్యులు చర్యలు తీసుకుంటారని నాగపూర్ మున్సిపల్ కమీషనర్ తుకారాం ముందే చెప్పారు. మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య 8,068కి పెరిగిన నేపథ్యంలో గర్భిణులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు మహారాష్ట్ర సర్కారు ఈ మొబైల్ డిస్పెన్సరీలను ప్రారంభించింది.