నిర్మల్, (ఆరోగ్యజ్యోతి): నిర్మల్ క్రమక్రమంగా.. కరోనా ఫ్రీజోన్ జిల్లాగా మారేందుకు అడుగులు వేస్తోంది. గత నెలరోజుల నుంచి విస్తృతంగా వ్యాపించిన వైరస్ ప్రభావం ప్రస్తుతం తగ్గుముఖం పడతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు వైద్యారోగ్య శాఖ, మున్సిపాలిటీలు ఉమ్మడిగా అమలు చేసిన ‘ఆపరేషన్ కరోనా’ జిల్లాలో సక్సెస్ అవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 23మందికి పాజిటివ్ రాగా, అందులో ముగ్గురు మరణించారు. మరో 20మందికి చికిత్సలు అందించగా, ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రి నుంచి పదకొండు మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12మంది గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న 16 ప్రాంతాలను మొదట కట్టడి ప్రాం తాలుగా అధికారులు ప్రకటించి వాటిని ఎక్కడికక్కడ దిగ్బంధించారు. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. అలాగే నిర్మల్, భైంసా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన నలుగురు, మర్కజ్ నుంచి వచ్చినవారు, అలాగే వారితో కాంటాక్ట్ అయినవారు మొత్తం 19 మంది కరోనాకు గురయ్యారు. అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు కంటి మీద కనుకులేకుండా కరోనాపైనే దృష్టి కేంద్రీకరించడంతో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యల కారణంగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి చేరలేదు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, ఎస్పీ శశిధర్‌రాజులు మొదటినుంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతోనే కరోనా కట్టడి కాగలిగింది. జిల్లాలోని 16 కట్టడి ప్రాం తాలలో తొమ్మిదిం టిని.. ఆ పరిధి నుంచి తప్పిం చారు. మరో ఒకటి , రెండు రోజుల్లో మిగతా కట్టడి ప్రాంతాలలో కూడా నిర్బంధాన్ని తొలగించనున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఎలాంటి పాజిటివ్ కేసు లు వెలుగు చూడనట్లయితే జిల్లాను కరోనా ఫ్రీ జోన్‌గా ప్రకటించేందుకు అవకాశాలు లేకపోలేదు.