కలెక్టర్ చే గిరిజనులకు నిత్యవసర వస్తువుల పంపిణీ



ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):   ఆదిలాబాద్ మండలంలోని లోహార గిరిజన గ్రామంలో సోమవారం రోజు సత్యసాయి ట్రస్ట్ వారిచే నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 50 వేల రూపాయల విలువ గల సరుకులను 40 కుటుంబాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కొక్క కిట్లో పదమూడు వందల రూపాయల విలువ గల వివిధ రకాలు వస్తువులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటింటికి తిరిగి సామాజిక దూరం పాటిస్తూ  నిత్య అవసర వస్తువులను పంపిణి చేసినారు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదని గ్రామస్థులు తెలుపగా మిషన్ భగీరథ నీటిని తెప్పిచి త్రాగినారు.లోహార, చిలాటిగూడ, సాలెగూడ  గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశార.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్ మండల తహసీల్దార్ మోహన్ సింగ్ సర్పంచ్ మాత్రం అనసూయ సత్యసాయి ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు నరసింహారావు కన్వీనర్ విలాస్ బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.