లిక్క‌ర్‌, రెస్టారెంట్‌, బార్బ‌ర్ షాపుల‌కు అనుమ‌తి లేదు

కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ కొన్ని షాపులు తెరుచుకునేందుకు వెస‌లుబాటు క‌ల్పించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి పుణ్య స‌లిలా శ్రీవాత్స‌వ్ మ‌రింత క్లారిటీ ఇచ్చారు.  తాము ఇచ్చిన ఆదేశాలు కేవ‌లం వ‌స్తువుల‌ను అమ్మే షాపుల గురించి మాత్ర‌మే అని అన్నారు.  హెయిర్ సెలూన్లు, బార్బ‌ర్ షాపులు స‌ర్వీస్ చేసినా.. వారికి ప్ర‌స్తుతం ఎటువంటి స‌డ‌లింపు లేద‌న్నారు.  క‌ట్టింగ్ షాపులు, సెలూన్లు ఓపెన్ చేసేందుకు ఇంకా ఆదేశాలు ఇవ్వ‌లేద‌న్నారు.  మ‌ద్యం దుకాణాలు కూడా ఓపెన్ చేయాల‌ని ఎటువంటి ఆదేశాలు ఇవ్వ‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.  కొత్త ఆదేశాల ప్ర‌కారం రెస్టారెంట్లు కూడా తెర‌వ‌డానికి వీలు లేద‌న్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులు తెరుచుకోవ‌చ్చు అని తెలిపారు. షాపింగ్ మాల్స్ మాత్రం తెర‌వ‌డానికి వీలులేదు.  ఇక ప‌ట్ట‌న ప్రాంతాల్లో, కంటోన్మెంట్ జోన్ల‌ను మినహాయిస్తే, మిగితా ప్రాంతాల్లో షాపులు తెరుచుకునే అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు.