న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ పరీక్షలు ఈ నెల 31న జరగాల్సి ఉంది. మే 20న పరిస్థితులను బట్టి కొత్త తేదీలను వెల్లడిస్తామని యూపీఎస్‌సీ ప్రకటించింది. భారత్‌లో ప్రస్తుతం మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 17 వరకూ ఈ లాక్‌డౌన్ ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. కరోనా కట్టడికి ప్రస్తుతం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు మాత్రం నమోదౌతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 42,533కు చేరింది. 1372 మంది చనిపోయారు. 11,707 మంది కోలుకున్నారు.