లక్నో: ఆగ్రా సెంట్రల్ జైల్లో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆనంద్ కుమార్ తెలిపారు. ఆగ్రా సెంట్రల్ జైల్లో మే 6న ఒక ఖైదీకి కరోనా పాజిటివ్‌గా తేలిందని, అతనికి అత్యంత సన్నిహితంగా ఉన్న మరో 9 మందికి తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిందని డీజీ వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సోకిన ఆ 10 మంది ఖైదీలను ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు ఆయన తెలిపారు. కరోనా సోకిన ఖైదీలున్న బ్యారక్‌లోనే మరో 102 మంది ఉన్నారని, వారందరికి కూడా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించామని యూపీ జైళ్ల డీజీ ఆనంద్ కుమార్ వెల్లడించారు.