తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,107కి చేరింది. అలాగే ఈరోజు 20 మంది కరోనా నుంచి పూర్తిగా కొలుకున్నారు. దీంతో కరోనా బాధితులను డిశ్చార్జ్‌ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 648 మంది డిశ్చార్జ్‌ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం 430 యాక్టివ్‌ కేసులున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 29 మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు నమోదైన కేసులున్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.