లక్నో: కరోనా సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించడానికి (ఇంక్యుబేషన్ వ్యవధి) 28 రోజుల వరకు పట్టవచ్చని ఉత్తరప్రదేశ్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడటంలేదని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎస్‌కే కల్రా తెలిపారు. ఓ వ్యకిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పరీక్షలు జరిపితే ‘నెగెటివ్'గా, ఆ తర్వాత వైరల్ లోడ్ పెరిగితే ‘పాజిటివ్'గా వస్తుందని ఆగ్రా జిల్లా దవాఖాన చీఫ్ రెసిడెంట్ డాక్టర్ సతీశ్ వర్మ వివరించారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు తరుచూ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.