అమరావతి,(ఆరోగ్యజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరుకుంది. ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందగా.. 524 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,093 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో కర్నూలు- 25, గుంటూరు- 19, కృష్ణా- 12, విశాఖ-06, కడప-04, చిత్తూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
జిల్లాల వారీగా చూస్తే...
ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపితే జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి. కర్నూలు- 491, గుంటూరు- 338, కృష్ణా- 278, నెల్లూరు- 91, చిత్తూరు- 82, కడప- 87, ప్రకాశం- 61, అనంతపురం-78, తూర్పుగోదావరి- 45, విశాఖపట్నం-35, పశ్చిమ గోదావరి-59, శ్రీకాకుళం జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. మొత్తం మీద చూస్తే.. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాత్రం రోజురోజకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటతో ఆయా జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది.