ముంబై మహిళా కార్పొరేటర్‌కు కరోనా వైరస్

ముంబై, (ఆరోగ్యజ్యోతి): మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటరుకు కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన మహిళా కార్పొరేటరును దక్షిణ ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. మహిళా కార్పొరేటర్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. కార్పొరేటర్ భర్తకు కూడా కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన మహిళా కార్పొరేటరును మొదట కస్తుర్బా ఆసుపత్రికి తరలించామని, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి మార్చామని, ప్రస్థుతం కార్పొరేటర్ కోలుకుంటుందని ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ చెప్పారు.