బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ‌ర్భిణీలకి సాయం చేసిన అన‌సూయ‌

యాంక‌ర్‌గా, న‌టిగా రాణిస్తున్న అన‌సూయ తన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కీసర మండలం లోని 100 మంది గర్భిణి స్త్రీ లకు న్యూట్రిషన్ కిట్స్‌ని పంపిణీ చేశారు. అంద‌రిని ప్రేమ‌గా ప‌ల‌క‌రిస్తూ అన‌సూయ ఈ పంపిణీ చేప‌ట్ట‌డంతో వారంద‌రు మురిసిపోయారు. కీస‌ర‌లోని చీర్యాల ప్రాంతంలో ఉన్న‌ ఫంక్ష‌న్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో సీపీ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు.బుల్లితెరకి గ్లామ‌ర్ అద్దిన అందాల బ్యూటీ అనసూయ‌కి అభిమానులు, సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. రంగ‌మ్మ‌త్త‌గా పాపుల‌ర్ పొందిన ఈ నటి ప్ర‌స్తుతం చిరు ఆఛార్య చిత్రంతో పాటు కృష్ణ‌వంశీ రంగ‌మార్తాండ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.