జన్మదిన సందర్భంగా కూరగాయల పంపిణి


విశాఖపట్నం, (ఆరోగ్యజ్యోతి) :స్వామి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ పాలూరి లక్ష్మణ స్వామి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. తన జన్మదిన సందర్భంగా మునిసిపల్ స్టాఫ్ 90 మందికి, 60 మంది మధ్య తరగతి వారికి కూరగాయల వితరణ జరిగింది. లాక్ డౌన్  సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని ప్రాంతాల్లో పని దొరకదు పని లేక పోవడం వల్ల అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు.తమకు తోచిన సహాయం చేశానని, అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయాలన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి.వి.యం.సి.ప్రత్యేక అధికారి  బి.వి.రమణ,పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు  టి.శ్రీరామ్ మూర్తి,జె.వి.వి.పట్టణ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమేష్ కుమార్ , స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ కమీషనర్ శ్రీ ఎస్ వి రమణ ,జిప్సా మాజీ అధ్యక్షులు శ్రీ ఎస్ వి కె పరసురామ్ మరియు వివిధ స్కూల్స్ కరెస్పాండెట్ లు పాల్గొని కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు..వీరందరి చేతులమీదుగా అందరికీ కాయగూరలు పంచారు..., ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ స్టాఫ్, స్నేహితులు ఎక్స్ లెంట్ సత్య,కె.దివాకర్, ఎ.వాసుదేవరావు,మింది గిరి  తదితరులు పాల్గొన్నారు.