ఇంఫాల్ : మణిపూర్ లోని క్వారంటైన్ సెంటర్ లో ఉన్న రోగికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో క్వారంటైన్ సెంటర్ ను అధికారులు మూసివేశారు. మణిపూర్ ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని జామియా గలినా అజిజ్ గర్ల్స్ కాలేజీని ఇటీవలే క్వారంటైన్ సెంటర్ గా మార్చారు. అయితే అందులో ఉన్న వ్యక్తికి పాజిటివ్ గా తేలడంతో క్వారంటైన్ సెంటర్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్ గా నిర్దారించారు.క్వారంటైన్ కేంద్రం నిర్వహిస్తోన్న భవనాన్ని పూర్తిగా మూసివేశామని, పాజిటివ్ వచ్చిన సదరు వ్యక్తి (31)ని జవహర్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐసోలేషన్ వార్డులో చేర్చామని ఇంఫాల్ ఈస్ట్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రంగితబలి వైఖోమ్ తెలిపారు.