గర్భిణీలకు బీట్రూట్ పంపిణీ


తాంసీ  (ఆరోగ్య జ్యోతి):   తాంసీ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరడిలో గల గొల్లగట్టు గ్రామంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కార్యకర్త (ఏ ఎన్ ఎం) లు బీట్రూట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఆరోగ్య కార్యకర్త (ఏ ఎన్ ఎం) అరుణ మాట్లాడుతూ గర్భవతులకు రక్తం తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో గొల్లగట్టు గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు బీట్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ సకాలంలో పోషకాహారం తీసుకోవాలని ఆమె తెలిపారు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు  నిర్వహించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సైతం సుమలత రవీందర్, ఆరోగ్య కార్యకర్త (ఏ ఎన్ ఎం) పుష్పలత, అంగన్వాడీ కార్యకర్త కవిత, ఆశ కార్యకర్త సంగీత, వీఆర్ఏ కిషన్ తదితరులు పాల్గొన్నారు.