- త్వరలో మనుషులపై ప్రయోగ పరీక్షలు : పీజీఐఎంఈఆర్
చండీగఢ్, (ఆరోగ్యజ్యోతి): కుష్టు నిరోధక ఔషధం మైకో బ్యాక్టీరియల్ డబ్ల్యూ(ఎండబ్ల్యూ) సేఫ్టీ ట్రయల్స్ పూర్తయినట్లు చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పీజీఐఎంఈఆర్) ప్రకటించింది. దీనితో త్వరలో పీజీఐ-చండీగఢ్, ఎయిమ్స్-ఢిల్లీ, ఎయిమ్స్-భోపాల్‌లలో 40 మంది వలంటీర్లపై ప్రయోగ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కరోనా రోగుల్లో సైటోకైన్ స్టార్మ్‌ను నిలువరించడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది.