సత్య మార్గం అద్వర్యంలో అన్నదానం

ఖమ్మం,(ఆరోగ్యజ్యోతి) :  ఖమ్మం  రూరల్ మండలంలోని ,  ఎదులాపురం,వెంపటి నగర్  నందు ఇతర జిల్లాలు ,ఇతర  రాష్ట్రాల నుండి వలస వొచ్చి, కరోన మహమ్మారి ప్రభావం  వల్ల ఉపాధి లేక రవాణా సదుపాయం లేక సొంత రాష్ట్రాల కు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వారికీ ప్రతి రోజు  సత్య మార్గం అద్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది. ఎందులో బాగంగా  ఈ రోజు 100మంది కూలీలకు అన్నదానం  కార్యక్రమం నిర్వహించడం జరిగినది.అలాగే వరంగల్ నుండీ మిర్యాలగూడ వెళ్తున్న అన్నార్తులకు ఆహారం అందించడం జరిగినది.ఈ కార్యక్రమం లో సత్య మార్గం డైరెక్టర్ శ్రీ లక్ష్మి నగేష్ గారు, సంస్థ సభ్యులు మరియు  AWJA ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్, వెంకటేష్ స్థానిక యువజన సంగం ప్రతినిధి సురేష్ మరియు వారి మిత్ర బృందం  తదితరులు పాలుగోన్నారు.