లాక్‌డౌన్ ఉల్లంఘన.. ఎమ్మెల్యే అరెస్ట్!

డెహ్రాడూన్: లాక్‌డౌన్ ఉల్లంఘించిన కారణంగా ఓ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అమన్ మని త్రిపాఠీ, పదిమంది అనుచరులతో కలిసి కేదార్‌నాథ్, బద్రీనాథ్ సందర్శనకు బయలుదేరారు. దీనికోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అయితే చమోలీ జిల్లాలో పోలీసు అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో త్రిపాఠీ వాగ్వాదానికి దిగారు. దాంతో ఎమ్మెల్యే సహా, ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి, బలవంతంగా వెనక్కు పంపించేశారు.