వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించింది. వరుసగా మూడో సారి సిలిండర్ ధర దిగివచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.214 తగ్గింది. ఈ తగ్గింపుతో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.583 నుంచి ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. తగ్గిన ధర నేటి నుంచే అమల్లోకి రానుంది. అటు నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రూ. 336 తగ్గి.. రూ.988 చేరింది. తగ్గిన ధరలతో హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 207 తగ్గి.. రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది.తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలెండర్(సబ్సిడీయేతర) ధర రూ.581.50. ముంబైలో 579 రూపాయలు. వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కేజీల ఎల్‌పీజీ సిలెండర్ల ధరలు కూడా తగ్గాయి. 1,285 రూపాయల నుంచి రూ 1029.50కు చేరుకున్నాయి.