సేవ లకు అభినందనలు

ల్గొండ,(ఆరోగ్యజ్యోతి):  ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పై సేవలందించిన ఆరోగ్య కార్యకర్తలకు సూపర్వైజర్లకు ఆశా వర్కర్లకు మీరు చేసిన సేవలు అభినందనీయమని నల్గొండ రహమత్ నగర్ కాలనీ వాసులు అభినందనలు తెలిపారు. గత నెల రోజుల నుంచి రహమత్ నగర్ లో ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ మీ ఆరోగ్యం ఎలా ఉన్నాయి ఒకవేళ అనారోగ్యం గురైతే చెప్పండి అంటూ నవ్వుతూ పలకరించిన వైద్య ఆరోగ్య సిబ్బంది కి కాలనీవాసులు కృతజ్ఞతలు .ఆదివారం రెడ్ జోన్ ను తొలగించడంతో ఇంటి బాట పట్టిన ఆశ వర్కర్లకు మహిళా ఆరోగ్య కార్యకర్తలకు సూపర్వైజర్లకు ఆ కాలనీవాసులు చప్పట్లతో అభినందనలు  తెలిపారు30 రోజులుగా ప్రతి ఒక ఇంటి తలుపు తడుతూ మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని ప్రతిరోజు అడుగుతూ ఈరోజుకు రెడ్ జోన్ ముగియడంతో తిరిగి వెళ్ళిపోతున్న ఆశా వర్కర్లకు మహిళా ఆరోగ్య కార్యకర్తలు సూపర్వైజర్ సిబ్బంది కాలనీవాసులు చప్పట్లతో అభినందించారు.