గుజరాత్‌లో కొత్తగా 510 కరోనా కేసులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఈ రోజు కొత్తగా 510 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఒక్క రోజులోనే నమోదైన ఎక్కువ కేసుల్లో ఇదే రికార్డు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 19119 కి చేరింది. ఈ రోజు 35 మంది కరోనా రోగులు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 1190 కు చేరింది.  అలాగే ఈ రోజు 344 మంది కరోనా వ్యాధి సోకి ఆసుపత్రులలో చికిత్స తీసుకుని నయం అయి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 13011 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4918.