నల్గొండ, (ఆరోగ్యజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నల్గొండ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు .జెండా వందన కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ప్రోగ్రాంఆఫీసర్ లు, ఆరోగ్య శాఖ సిబ్భంది పట్టణ మలేరియాపథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.