ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ ను సోమవారం నాడు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ ఆధ్వర్యంలోమర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగులు కొన్ని సమస్యలతో ఉన్నారని వాటిని మీ ఆధ్వర్యంలో పరిశీలించి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని బండారి కృష్ణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరి వామన్, కోశాదికారి అనిల్ ,సత్యనారాయణ, చంద్ర శేకర్, గాజుల రమేష్,రఘురాం ,ఫార్మసిస్ట్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.