ఆదిలాబాద్ లో 126 కరోన కేసులు

 


ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు 126 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2037 మందికి కరోనా  వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 126 మందికి ఉన్నట్లు నిర్ధారణ అయింది. 1902 మందికి కరోనా  నెగిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. మరో 19 కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. 63 మందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని డిచర్జ్  చేయడం జరిగిందని తెలిపారు.