ఆరోపణలపై పూర్తి స్టాహిలో విచారణ జరిపించాలి

తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్


ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): పారామెడికల్ సిబ్బంది వైద్యులపై చేస్తున్న ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మెట్పల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ ప్రవ న్,ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం  శ్రీకాంత్ ,కార్యదర్శి డాక్టర్ సామంత్లు శుక్రవారంనాడు  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైద్య అధికారులు విధి నిర్వహణలో భాగంగా పారామెడికల్ సిబ్బంది తో కఠిన వైఖరిని చేస్తున్నారని, అపార్థం చేసుకుని దానిని వేధింపుల చిత్రీకరిస్తూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే వైద్య అధికారి పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, విచారణలో సదరు వైద్యుల తప్పు లేనట్లయితే ఆరోపణలు చేసిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.